తొలి పౌర్ణమి - 13

“ ఏంటి చాందినీ….”నీకేమన్నా పిచ్చి పట్టిందా, రేస్ పోతే పోయింది. నీ చెయ్యి చూడు ఒకసారి, ఏమన్నా అయ్యుంటే..నా చెయ్యి వంక చూసా రక్తం కారుతోంది, జయ ని పట్టుకున్నప్పుడు బండి అంచు గీసుకున్నట్టుంది, నాకిప్పుడు ఆ బాధ లేదు తను నా గురించి మొదటి సారి ఇలా ఆలోచిస్తోంది అన్న ఆనందం..జయ ని పట్టుకున్నప్పుడే బండి ఆపేయొచ్చుగా….లైఫ్ లో ఫస్ట్ టైమ్ పార్టిసిపేట్ చేస్తున్నా చాందిని అందుకే అలా చేశా.., ఇంకెప్పుడు చెయ్యను లే..అయినా నువ్వు ఏం చేస్తే నాకేంటి, నేను చెయ్యాల్సింది చేస్తా అంటూ, శృతి తెచ్చిన పసుపును గాయం చుట్టూ బాగా దట్టించింది..తనతో వచ్చిన ప్రాబ్లం ఇదే, నేను ఎంతగా ఎక్స్‌ప్రెస్ చేయాలనుకున్న ఇలా మాట దాటేస్తుంది..పసుపు గాయానికి తగలగానే మంట పుట్టాలిగా, నిజంగా చెప్తున్నా నాకు హాయిగా అనిపిస్తోంది, కొందరి స్పర్శ అంతే..ఆ తర్వాత మొదటి బహుమతి అందుకున్నాం..అలా మొదలైన జాతర ఎన్నో విశేషాలతో ముందుకు