ప్రేమ్ ని బాల్కనీలో చూడగానే నితిన్ ఇంకా అరుణ్ కి చాలా కోపం వస్తుంది కోపంలో " నువ్వేం రా ఇక్కడ" అని ఇద్దరు ఒకేసారి అడుగుతారు. ప్రేమ్ నీ అక్కడ చూడగానే ప్రియా 'అంటే నా గెస్ కరెక్టే అన్నమాట వీడు నేను పూజ మొదలు పెట్టినప్పుడు వచ్చి ఉంటాడు ' అని అనుకుంటుంది తన మనసులో.ఎలాగో వాళ్ళందరూ చూసేసారు కదా ఇంకా దాక్కోవడం అనవసరం అనుకుని ప్రేమ్ ముందుకు వస్తూ " మీరు ఎందుకు వచ్చారో నేను అందుకే వచ్చాను " అని అంటాడు."అంటే?" అని అడుగుతాడు నితిన్. " అంటే కంటే ఏమీ లేదు నా బంగారం" ప్రియా వైపు చూపిస్తూ " పొద్దున్నే ఫోన్ చేసి నాకు ఈ రోజు ఎంగేజ్మెంట్ అని చెప్పి బాంబ్ పేల్చింది అంట కదా అది వినినప్పటి నుంచి మా వదిన టెన్షన్ పడిపోయింది మా వదిన టెన్షన్ చూడలేక ఏం జరిగిందో