తొలి పౌర్ణమి - 11

  • 327
  • 120

సోమవారం పొద్దున్నే లేచి ఆఫీస్ కి రెడీ అవుతున్నాను, కొన్ని రోజులు చూసి ఈ జాబ్ మానేసి తనని వెతికిన తర్వాత ఇంకో జాబ్ వెతుకుదామని అనిపిస్తోంది.“ఏంట్రా విక్రమ్ వారం రోజుల నుంచి చూస్తున్నా చాలా దిగాలుగా ఉన్నావ్” అంటూ అడిగింది అమ్మ.అలాంటిదేమీ లేదమ్మా. నీ కళ్ళలోనే కనిపిస్తోంది, ఏమైందిరా. విషయం చెప్పలేక ఇలా చెప్పా, అదే అమ్మ ఆ కొత్త ఆఫీస్ లో మనుషులు ఎలా ఉంటారా అని ఆలోచిస్తున్నా. ఎలా ఉన్నా వాళ్లు మనుషులే కదరా ఏలియన్స్ కాదు కదా మనం మంచిగా ఉంటే అంతా మంచిగానే ఉంటుంది.“మనం ఏదైనా అబద్ధం ఆడినప్పుడు దాని గురించి నీతులు వినడం చాలా దారుణంగా ఉంటుంది..”షూ వేసుకొని బయలుదేరాను.రేయ్ విక్కీ ఒక 20 నిమిషాలు ఆగరా దోసెలు చేస్తా తిని వెళ్దువు గాని.వద్దమ్మా, ఇప్పుడే లేట్ అయింది, జయా గాడు తొందరగా వస్తా అన్నాడు, ఈరోజు అక్కడే భోంచేస్తాం ఇద్దరం. సరే నీ ఇష్టం, జాగ్రత్తగా వెళ్ళి