అక్కడ వీళ్ళ లాంటి ఫ్రెషర్స్ ఒక 30 మంది ఉన్నారు. ఇద్దరు వెళ్లి వాళ్లతో పాటు కూర్చున్నారు, కాసేపటి తర్వాత హెచ్ఆర్ లోనికి వచ్చింది..హార్టీ వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్స్ “మై నేమ్ ఈజ్ మేఘన”, అంటూ తన స్పీచ్ మొదలుపెట్టి ఒక ఐదు నిమిషాలు ప్రసంగించింది. గాయ్స్, ఇక్కడున్న 30 మంది లో 20 మందికి మేము ఒక టెక్నాలజీ మీద ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం, ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు ప్రాజెక్టులను అలోకేట్ చేయడం జరుగుతుంది. ఆ మిగిలిన పదిమంది ఏం చేయాలో నేను చెప్తా అంటూ 10 పేర్లు పిలిచింది, చాందిని మరియు శృతి ఇద్దరూ అందులో ఉన్నారు, “ఈ పదిమంది నాతో రండి, మిగిలిన వాళ్ళందరికీ నా సబార్డినేట్ ట్రైనింగ్ గురించి వివరిస్తాడు”, అంటూ తన క్యాబిన్ వైపుగా వెళ్ళిపోయింది హెచ్ఆర్.చాందిని, శృతిలు కంగారుగా ఆ మిగిలిన వాళ్ళతో కలిసి హెచ్ఆర్ క్యాబిన్ వైపు నడిచారు.నేను చెప్తే విన్నావా,