హేమ వెంటనే విక్రమ్ వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చి, “కళ్ళు నెత్తి మీద ఉన్నాయా నీకు, నేను ఇంతసేపు కష్టపడి కట్టినదంతా కూల్చేశావు” అంది.. ఒక అమ్మాయి అలా అరవడం మొదటిసారి చూస్తున్నాడు విక్రమ.. నువ్వు పిలిస్తే పలకలేదు, కంగారుగా వస్తున్నప్పుడు నా కాలికి తగిలిన రాయి వాటిని పడేసింది, ఇందులో నా తప్పు ఏముంది అన్నాడు విక్రమ్. నా పనిని చెడగొట్టింది గాక, ఇంకా నిన్ను సమర్థించుకుంటున్నావా. ఓ కట్టావులే! ఐఫిల్ టవర్. నేను ఐఫిల్ టవర్ కడతానో లేదా మొబైల్ టవర్ కడతానో నీకెందుకు, ఇంతకీ ఎందుకు వచ్చావు మా ఇంటికి అంది హేమ. నీకోసమేం కాదు లే, నేను ఆకాష్ కోసం వచ్చా అన్నాడు గట్టిగా..ఆకాష్ లేడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు…అది ముందే చెప్పుంటే అక్కడినుంచే వెళ్ళేవాడిని గా, నీతో ఇన్ని మాటలు పడే అవసరం ఉండేది కాదు..మళ్ళీ సీరియస్ గా చూసింది హేమ..నేను వెళ్తా వాడొచ్చినప్పుడు చెప్పు..ఎక్కడికీ వెళ్ళేది,