మనం భవిష్యత్తుని తరిమితే మనల్ని తరిమేదే గతం, ఇక్కడ గతం అంటే సమయం కాదు సందర్భం, మన మనస్సులో ఏదో ఒక మూలన నిలిచిపోయిన ఆలోచన మనల్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. ****సాయంత్రం నాలుగు కావస్తోంది. క్రికెట్ బ్యాట్ తీసుకుని గ్రౌండ్‌కి పరిగెత్తాను, నేను వెళ్లేసరికి అందరూ సిద్ధంగా ఉన్నారు.“ఏంట్రా లేట్ అయ్యింది” అడిగాడు వాసు. గ్రిప్పర్ లేకుండా ఆడుతుంటే చేతులు కోసుకుంటున్నాయి రా.., అందుకే కొనడానికి వెళ్ళా..సరే నువ్వు,విజయ్ చెరోవైపు కెప్టెన్లుగా ఉంటారు, నేను నీ బదులుగా ఆల్రెడీ మన టీం ని సెలెక్ట్ చేసుకున్నా..“అలగా మరి టాస్ అయ్యిందా..” హా.., మనదే ఫస్ట్ బ్యాటింగ్..ఓపెనింగ్ నువ్వే దిగాలి..“సరే వాసు” అంటూ కొత్త గ్రిప్పర్ ను బ్యాట్ కు తొడిగి, బరిలోకి దిగా..నా జట్టులో నేను, వాసు; అవతలి జట్టులో ఆకాశ్, విజయ్ ఉన్నారు, మిగతా వాళ్లంతా నాకు