యంత్రం వెనుక మనసు - 14

  • 51

అమ్మ నోట ఆ మాట వినగానే నీల గుండె ఒక్కసారిగా జల్లుమంది. లోపల ఏదో తెలియని ఒక మధురమైన అలజడి మొదలైంది. మనసులోనే దేవుడికి వంద దండాలు పెట్టుకుంది. అయాన్‌తో కలిసి ఈ నడిరాత్రి వేళ, నిశ్శబ్దంగా ఉన్న లోకంలో ఒంటరిగా నడిచే అవకాశం దొరుకుతుందని ఆమె అస్సలు ఊహించలేదు. ఆ ఆలోచనే ఆమె నరనరాల్లో ఒక వింత కంపనాన్ని పుట్టించింది.మంచం మీద గుర్రుపెట్టి పడుకున్న అన్నయ్య వైపు ఒకసారి చూసింది. అంతవరకు వాడిపై ఉన్న కోపమంతా మాయమై, ఇప్పుడు ఒక చిన్న స్వార్థం మనసును కమ్మేసింది. "ఒరేయ్ అన్నయ్యా! నువ్వు ఈ రాత్రంతా అసలు లేవకపోతేనే మంచిదిరా. పొరపాటున కూడా కళ్లు తెరవకు.. అలాగే హాయిగా నిద్రపో!" అని మనసులోనే బతిమాలుకుంది. ఎందుకంటే, ఆర్య గనుక లేస్తే ఈ అందమైన క్షణం, అయాన్ తోడు తనకి దక్కకుండా పోతుందని ఆమె భయం.ఎక్కడ ఆర్య నిద్ర లేచిపోతాడో అన్న కంగారుతో... గుండె వేగం