సుస్మిత ఆ పాత సంఘటనను తలచుకుంటూ దీర్ఘాలోచనలో పడిపోయింది. సుస్మిత కు గతం గుర్తొచ్చి కళ్ళలో నీళ్లు తిరిగాయి.అప్పుడు నీలా కాలేజీలో కొత్తగా చేరిన రోజులు. కాలేజీలో ఒక ఆకతాయి నీలాను నిరంతరం వేధిస్తూ ఉండేవాడు. కానీ నీలా ఆ విషయాన్ని ఎప్పుడూ ఇంట్లో చెప్పలేదు. ఒకవేళ చెబితే, తన తల్లి పాతకాలం మనిషి కాబట్టి, ఎక్కడ తన చదువు ఆపేసి ఇంట్లో కూర్చోబెడుతుందో అన్నది నీలా భయం. కానీ ఆ రోజు ఆ ఆకతాయి శృతి మించి ప్రవర్తించాడు.సరిగ్గా అదే సమయంలో, నీలా మరిచిపోయిన లంచ్ బాక్స్ ఇవ్వడానికి ఆర్య కాలేజీకి వచ్చాడు. అక్కడ తన చెల్లిని ఒకడు అసభ్యంగా వేధిస్తుండటం చూసి ఆర్య రక్తం మరిగిపోయింది. పిడుగుల్లాంటి దెబ్బలతో వాడిని చితకబాదేశాడు. నీలా కు ఆర్య కు ఎన్ని గొడవలు ఉన్న చెల్లిని ఎవరైనా ఏమైనా అంటే అస్సలు ఊరుకోడు నీలా కూడా అంతే ఎంత ఏడిపించిన తనే