అఖిరా – ఒక ఉనికి కథ - 3

ఎపిసోడ్ – 3రెండు రోజులు గడిచాయి…రాత్రి తొమ్మిదికి దగ్గరపడుతోంది. సువర్ణ కిచెన్‌లో భోజనం చేస్తున్నారు. అఖిరా నెమ్మదిగా ఆమె దగ్గరికి వెళ్లి,“పిన్నీ… మీరు చేయొద్దు. నేను చేస్తాను. మీకు రెస్ట్ కావాలి,” అంది.సువర్ణ ముఖంలో ఎప్పటిలానే కఠినత్వం ఉంది.“నేనే చూస్తాను… నువ్వు వెళ్లు,” అంది.అఖిరా పిన్నీ చేతిని పట్టుకుని మృదువుగా,“పిన్నీ… మీరు ఎన్ని సార్లు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నా… నేను మాత్రం మీరు, నిక్కీ ఇద్దరినీ వదిలి ఎక్కడికి వెళ్లను.నాన్న చివరి మాట గుర్తొస్తోంది… మీ ఇద్దరి బాధ్యత నాది,” అంది.ఈసారైనా సువర్ణ సమాధానం ఇచ్చింది. కానీ అది సాఫ్ట్ కాదు—కేవలం అలసట.“అలాగే చూడు,” అని చిన్నగా అనడంతో, ఆవిడ కుంగిపోయిన మనసు కనపడింది.ముగ్గురూ కలిసి భోజనం చేశారు.తర్వాత పిన్నీ, నిక్కీ గదిలో పడుకోబెట్టేందుకు వెళ్లింది.అఖిరా వాళ్లిద్దరినీ చూస్తూ తలుపు మెల్లగా మూసి తన గదికి వెళ్లింది.అలమార లోపలున్న పాత పెట్టె తీసి నాన్న రాసిన లేఖను తెరిచింది.“అఖిరా… నేను