ప్రేమలేఖ..? - 3

  • 231

ఇది మనసులో పెట్టుకొని నువ్వు ఏ నిర్ణయమైనా తీసుకో. పిచ్చి పనులు చేస్తే మాత్రం ఊపిరి వదిలేస్తు నువ్వు దించుకున్న బరువు ఊపిరి ఉన్నంతవరకు మోస్తూన్న శవంలో మారిపోతాను...అని చివరి మాటగా స్థిరంగా చెప్పిన ఆనంద్ లీల నుదురు మీద పెదవులద్దే వెళ్లిపోయాడు అక్కడ నుంచి. నిలువునా మోకాళ్ళ మీదకు జారిపోయిన లీల కన్నీళ్లకు ఆమె గుండె కోతే సమాధానంగా మారింది.చాలా సేపటి వరకు అలాగే ఉండిపోయిన లీలా నెమ్మదిగా లేచి ఆ పక్కనే ఉన్న పిల్ల కాలువలో మొహం కడుక్కొని తనని తాను సముదాయించుకొని కిందపడిపోయిన తన కాలేజీ బ్యాగ్ ఇంకా జ్ఞాపకాలకు అద్దాం అయిన ఆ బుక్ చేతిలోకి తీసుకొని లేచింది. ఆనంద్ కి తనకి మధ్య ప్రేమ చిగురించిన క్షణం నుంచి ఇప్పటివరకు అందమైన జ్ఞాపకాలను, ఆవేదనకు గురి చేసిన క్షణాలను భద్రంగా దాచుకున్న ఆ బుక్ కన్నా ఇప్పుడు అందులో ఉన్న ప్రేమ లేఖ మరింత అపురూపంగా మారింది