ప్రేమమ్ - 1

  • 17.9k
  • 4
  • 7.1k

" ప్రీతీ...!! ప్రీతీ... ఐ లవ్ యూ... ఐ లవ్ యూ రా... నాకింకా బ్రతకాలని వుంది... నీతో కలిసి బ్రతకాలని వుంది... నీతో కలిసి బ్రతకాలని వుంది ప్రీతీ నాకు... " కష్టంగా శ్వాస తీసుకుంటూ చెప్తూనే, ఆమె ఒడిలో తన ఆఖరి శ్వాస విడిచాడు అతను... " అరుణ్...!!! " ఉలిక్కి పడి లేచింది ఆమె...ఒళ్లంతా చిరు చెమటలు... బిక్కు బిక్కుమంటూ చుట్టూరా చూసుకుంది... వణికే చేతులతో, పక్కనే బెడ్ ల్యాంప్ స్టాండ్ మీదున్న వాటర్ బాటిల్ తీసుకొని, సగం నీళ్ళు తాగేసింది...బాటిల్ పక్కన పెడుతూ, గోడకున్న గడియారం వైపు చూసి, అప్పటికే టైం తెల్లవారి నాలుగున్నర గంటలు అవ్వడంతో, అరి చేతులతో మొహాన్ని రబ్ చేసుకొని, బెడ్ దిగి, తన గదిలోంచి బయటకు నడిచి, ఇంటి పనులు మొదలుపెట్టింది ప్రీతి... ఇళ్ళు, వాకిలి శుభ్రం చేసి, వాకిట్లో కళ్ళాపి జల్లి, ముగ్గు పెట్టేసరికి సమయం అయిదు గంటలు..."