తన ప్రేమకై - 1

  • 28.8k
  • 4
  • 12.4k

"తన బిడ్డ భవిష్యత్తే గమ్యం"అతనికి.."అతనే గమ్యం" ఆమెకి ఈ ఇద్దరి ప్రేమకథే నాఈ ప్రేమపాశం....ఎప్పుడూ నవ్వుతూ ఉండే "హరిణి"మొహం చిన్నబోయింది.. కారణం! తను కొన్ని సంవత్సరాలాగా ఎంతగానో ప్రేమిస్తున్నా.. కాదు కాదు ఆరాధిస్తున్న"శ్రీవిష్ణు" బిడ్డని మొదటిసారి చూసింది..అతని ఒడిలో బుడ్డిది నాన్న నాన్న అంటూ అంటిపెట్టుకుపోతుంది.. హా మై బేబీ! నా చిన్ను బంగారం అంటూ ముద్దు చేస్తున్నాడు విష్ణు.. వాళ్లిద్దరి ఆప్యాయతని చూసి ఒక్క నిమిషం హరిణి కి ఏమి అర్థం కాలేదు.. తను ప్రాణంగా ప్రేమించిన మనిషి తనకు తెలియకుండా ఒక బిడ్డకి తండ్రి అయ్యాడు..మనం నిజంగా ప్రేమిస్తే మన ప్రేమ ఎదుటివారిని కదిలిస్తుంది అంటారు కదా! మరి నా ప్రేమ నీకెందుకు తెలియలేదు విష్ణు.. నువ్వే నా గమ్యం అనుకున్నానే మరి నువ్వెందుకు నాకు ఒక్క అడుగులో కూడా తోడు లేకుండా దూరంగా వెళ్ళిపోయావు.. నేను ప్రతిరోజు నీ ఆలోచనల్లోనే బ్రతుకుతున్నాను.. నీ గురుంచిన ప్రతి ఆలోచన