Incomplete poem book and story is written by swathi in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Incomplete poem is also popular in నాటకం in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
అసంపూర్ణ కావ్యం - నవలలు
swathi
ద్వారా
తెలుగు నాటకం
పల్లె పడచు - వెన్నెలమనసుఅదొక అందమైన కుగ్రామం. స్వచ్ఛమైన గాలి, మదిని పులకరింపజేసే వాతావరణం. అటు ఇటు ఊగుతూ నవ్వుతూ పలకరించే పచ్చని పొలాలు, ఎటు చూసినా ఆత్మీయంగా స్వాగతం పలుకుతున్నట్లుండే పైరు గాలులు. మనసుకి ప్రశాంతత కావాలంటే ఎక్కడికో వెళ్ళనక్కర్లేదు, మా ఊరు వస్తే చాలు అన్నట్టుగా మెరిసిపోయే బంతి పూల తోటలు. ఆ ఊరి అందాన్ని చూస్తుంటే... 'అయ్యో! మనం ఇలాంటి ఊరిలో ఎందుకు పుట్టలేదా?' అని ప్రతి ఒక్కరికీ అనిపించక మానదు. అలాంటి ప్రకృతి ఒడిలో మొదలైన కావ్యం ఇది.ఆ ఊరి పేరు వినగానే అందరికీ గుర్తొచ్చే మరో అందమైన రూపం 'వెన్నెల'. ఆమె పేరుకు తగ్గట్టే మనసు కూడా నిండు వెన్నెలంత స్వచ్ఛమైనది. సన్నటి తీగలా ఉండే శరీరాకృతి, చామనచాయ రంగులో ఉన్నా ఆమె నవ్వులో ఏదో తెలియని ఆకర్షణ ఉంటుంది. ఆమె మాట్లాడుతుంటే ముత్యాలు రాలిపడుతున్నాయా అన్నంత హాయిగా ఉంటుంది ఆ గొంతు. ఎవరినీ
పల్లె పడచు - వెన్నెలమనసుఅదొక అందమైన కుగ్రామం. స్వచ్ఛమైన గాలి, మదిని పులకరింపజేసే వాతావరణం. అటు ఇటు ఊగుతూ నవ్వుతూ పలకరించే పచ్చని పొలాలు, ఎటు చూసినా ఆత్మీయంగా స్వాగతం పలుకుతున్నట్లుండే పైరు గాలులు. మనసుకి ప్రశాంతత కావాలంటే ఎక్కడికో వెళ్ళనక్కర్లేదు, మా ఊరు వస్తే చాలు అన్నట్టుగా మెరిసిపోయే బంతి పూల తోటలు. ...మరింత చదవండిఊరి అందాన్ని చూస్తుంటే... 'అయ్యో! మనం ఇలాంటి ఊరిలో ఎందుకు పుట్టలేదా?' అని ప్రతి ఒక్కరికీ అనిపించక మానదు. అలాంటి ప్రకృతి ఒడిలో మొదలైన కావ్యం ఇది.ఆ ఊరి పేరు వినగానే అందరికీ గుర్తొచ్చే మరో అందమైన రూపం 'వెన్నెల'. ఆమె పేరుకు తగ్గట్టే మనసు కూడా నిండు వెన్నెలంత స్వచ్ఛమైనది. సన్నటి తీగలా ఉండే శరీరాకృతి, చామనచాయ రంగులో ఉన్నా ఆమె నవ్వులో ఏదో తెలియని ఆకర్షణ ఉంటుంది. ఆమె మాట్లాడుతుంటే ముత్యాలు రాలిపడుతున్నాయా అన్నంత హాయిగా ఉంటుంది ఆ గొంతు. ఎవరినీ
అలా రోజులు గడుస్తున్నాయి.. వెన్నెల ఎప్పటిలాగే తన గులాబీ మొక్కలకు నీళ్లు పోస్తూ, మురిపెంగా ముచ్చట్లు చెప్పుకుంటోంది. అది చూసిన చుట్టుపక్కల వాళ్ళు మళ్ళీ నోళ్లు పారేసుకున్నారు. "చూడండి.. మళ్ళీ మొదలుపెట్టింది ఈ పిచ్చిది! ఇలాంటి వాళ్ళని వదిలేస్తే మన పిల్లలు కూడా ఇలాగే తయారవుతారు" అంటూ విసిరేసిన మాటలు వెన్నెల మనసుని చివుక్కుమనిపించాయి. ...మరింత చదవండివాళ్ళ అమ్మ శారద మాట్లాడబోతూ ఉంటే ఒక్కసారి గా ఎవరో ఇక చాలు అన్నట్టు అనిపించింది ఎవరు అని వెనుకకు తిరిగి చూస్తే సరిగ్గా అప్పుడే.. "ఆమె చేస్తున్న తప్పేమిటి?" అన్న ఒక గంభీరమైన గొంతు వినిపించింది. "మొక్కలకి ప్రాణం పోస్తూ, వాటితో కాలం గడపడం నేరమా? అది పిచ్చితనం కాదు, ప్రకృతి మీద ఉన్న అమితమైన ప్రేమ" అంటూ ఒక వ్యక్తి ఆమెకు అండగా నిలబడ్డాడు. వెన్నెల ఆశ్చర్యంగా తల ఎత్తి చూసింది. సుమారు 5.6 అడుగుల ఎత్తు, మెరిసే కళ్ళు, ముఖంలో
నా గురించి చెప్పడానికి ఏముంది కిషోర్ గారు? కానీ మీరు వదలడం లేదు, అడుగుతూనే ఉన్నారు" అంటూ వెన్నెల ఒక్క క్షణం ఆగి నిట్టూర్చింది. కిషోర్ వెన్నెల కళ్ళలోకి తీక్షణంగా చూస్తున్నాడు. ఆమె మౌనం వెనుక ఏదో పెద్ద సముద్రమే దాగి ఉందని అతనికి అర్థమవుతోంది. పెదవి విప్పడానికి వెన్నెల తటపటాయిస్తుంటే.. కిషోర్ ఆకాశంలోని ...మరింత చదవండిచూపిస్తూ నెమ్మదిగా ఇలా అన్నాడు.. "చూడు వెన్నెలా! మనకు ప్రతిరోజూ రాత్రి చందమామ కనిపిస్తుంది. అది వింతేమిటి అనిపిస్తుందా? కానీ మనం చూసే కళ్ళలోనే అదంతా ఉంటుంది. ఒక్కోసారి నిండుగా, ఇంకోసారి సగంలా, అప్పుడప్పుడు సూర్యుడిలా ప్రకాశిస్తుంది.. కొన్నిసార్లు అసలు కనిపించదు. అలాగని దాని అందం తగ్గిపోతుందా? లేదు కదా! మనిషి జీవితం కూడా అంతే. మనలోని వెలుగు చీకట్లు మనల్ని మార్చలేవు."ఆ మాటలు వెన్నెల గుండెల్లో ఎక్కడో గుచ్చుకున్నాయి. ఒక అపరిచితుడు తన మనసులోని శూన్యాన్ని ఇంతలా ఎలా చదివేస్తున్నాడా అని ఆశ్చర్యపోయింది.
సరిగ్గా అప్పుడే లోపల నుండి జానకి గారు, ఆమె పెద్ద కొడుకు రాజు బయటకు వచ్చారు. బయట జరుగుతున్న రభస చూసి రాజు కంగారుగా పరుగెత్తుకు వచ్చాడు. "ఎందుకురా అలా అరుస్తున్నావు? ఏమైంది?" అని రాజు అడగ్గా.. "చూడు అన్నయ్యా! ఈ అమ్మాయి ఎవరో నాకు తెలీదు, కానీ ఎప్పటి నుంచో తెలిసినట్టు పలకరిస్తోంది. ...మరింత చదవండిపిచ్చిపిచ్చిగా మాట్లాడుతోంది!" అని కిషోర్ విసుక్కున్నాడురాజు వెన్నెల కళ్ళలోని నిస్సహాయతను చూసి పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. అతని కళ్ళలో ఏదో తెలియని జాలి మెరిసింది. "నువ్వు లోపలికి వెళ్ళు కిషోర్.. నేను మాట్లాడుతాను" అని తమ్ముడిని లోపలికి పంపివేసి, వెన్నెల వైపు తిరిగాడు. "లోపలికి రామ్మా.. వెన్నెలా.." అని ఆదరంగా పిలిచాడు. జానకి గారు మౌనంగా వెళ్లి నీళ్లు తెచ్చి వెన్నెలకు ఇచ్చారు. ఆమె చేతులు వణుకుతుంటే, ఆ నీళ్ల గ్లాసును అందుకోవడానికి కూడా వెన్నెలకు శక్తి లేకపోయింది. ఆ గదిలో ఆవరించిన నిశ్శబ్దం
అలా కొన్ని రోజులు వెన్నెల, కిషోర్ మధ్య మౌనమైనా, మనసులకి చేరువైన స్నేహం ఎంతో అందంగా గడిచింది. కానీ, లోకం ఎప్పుడూ ఇతరుల ఆనందాన్ని చూసి ఓర్వలేదు కదా! ఒకరోజు వెన్నెల ఎప్పటిలాగే కిషోర్ ఇంటికి వెళ్తుంటే, వీధి చివర ఉన్న కొందరు మనుషులు మళ్ళీ నోళ్లు పారేసుకున్నారు. "చూడండి.. ఆ మొక్కల పిచ్చిది ...మరింత చదవండిదీనికి తోడు తోటలో ఇంకో మొక్కల పిచ్చోడు తోడయ్యాడు. ఇద్దరికీ పిచ్చి బాగా ముదిరినట్టుంది" అంటూ బిగ్గరగా హేళన చేశారు.ఆ మాటలు వెన్నెల చెవిన పడకముందే, వెనుక వస్తున్న శారదమ్మ గుండెల్లో మంటలు రేపాయి. ఇన్నాళ్లూ తన బిడ్డ గురించి వింటున్న వెటకారాలు, గుసగుసలు ఒక ఎత్తైతే, ఇప్పుడు నేరుగా చేస్తున్న ఈ అవమానం ఆమె సహనాన్ని పరీక్షించింది. శారదమ్మకు ఉన్న ఓపిక ఒక్కసారిగా నశించిపోయింది. "ఎవరది? నా బిడ్డ గురించి అంత మాట అన్నది ఎవరు?" అంటూ ఆమె ఒక సింహంలా గర్జించింది.ఎప్పుడూ