మట్టిలో మాణిక్యం నిజ జీవిత కథ సిరీస్

(0)
  • 186
  • 0
  • 525

ఇది ఒక సాధారణ కుటుంబం లో పుట్టిన అమ్మాయి నిజ జీవిత కథ .. నా పేరు మీనాక్షి.నేను ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను.మధ్యతరగతి అంటే… ఒక రోజు పని చేస్తే కడుపు నిండుతుంది, కానీ భవిష్యత్తు గురించి ఎప్పుడూ ఒక భయం వెంటాడుతూనే ఉంటుంది.మా నాన్న సాధారణమైన కూలి.ఎండలోనూ, వానలోనూ కష్టపడుతూ మా కుటుంబాన్ని నిలబెట్టాడు.అతని చెమట చుక్కలే మా జీవితానికి బతుకు దెరువు.మా నాన్న కష్టపడే స్వభావం నాకు ఎప్పుడూ గర్వకారణం.మా అమ్మ ఒక అద్భుతమైన గృహిణి.అలాగే నాన్న తో కూలి పనికీ వెళ్ళేది, కానీ ఇంట్లో మమ్మల్ని చూసుకోవడంలో ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు.మా ఇంటి అల్లరి, సంతోషం, కష్టాలన్నింటికీ ఆమె ఒక పెద్ద ఆధారం.మా నాన్న ఒక పట్టణంలో పుట్టి పెరిగాడు.మా తాతయ్య, నాయనమ్మలకు పెద్దగా ఆస్తులు లేవు.అందుకే చిన్నప్పటి నుంచే కష్టాలు ఎదుర్కొన్నారు.మా నాన్నకి ఐదుగురు అన్నదమ్ములు.ఆ ఐదుగురిలో ఆయన రెండవ వాడు.చిన్న వయసులోనే ఒక కిరాణా

1

మట్టిలో మాణిక్యం నిజ జీవిత కథ సిరీస్ - 1

ఇది ఒక సాధారణ కుటుంబం లో పుట్టిన అమ్మాయి నిజ జీవిత కథ ..నా పేరు మీనాక్షి.నేను ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను.మధ్యతరగతి అంటే… ఒక పని చేస్తే కడుపు నిండుతుంది, కానీ భవిష్యత్తు గురించి ఎప్పుడూ ఒక భయం వెంటాడుతూనే ఉంటుంది.మా నాన్న సాధారణమైన కూలి.ఎండలోనూ, వానలోనూ కష్టపడుతూ మా కుటుంబాన్ని నిలబెట్టాడు.అతని చెమట చుక్కలే మా జీవితానికి బతుకు దెరువు.మా నాన్న కష్టపడే స్వభావం నాకు ఎప్పుడూ గర్వకారణం.మా అమ్మ ఒక అద్భుతమైన గృహిణి.అలాగే నాన్న తో కూలి పనికీ వెళ్ళేది, కానీ ఇంట్లో మమ్మల్ని చూసుకోవడంలో ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు.మా ఇంటి అల్లరి, సంతోషం, కష్టాలన్నింటికీ ఆమె ఒక పెద్ద ఆధారం.మా నాన్న ఒక పట్టణంలో పుట్టి పెరిగాడు.మా తాతయ్య, నాయనమ్మలకు పెద్దగా ఆస్తులు లేవు.అందుకే చిన్నప్పటి నుంచే కష్టాలు ఎదుర్కొన్నారు.మా నాన్నకి ఐదుగురు అన్నదమ్ములు.ఆ ఐదుగురిలో ఆయన రెండవ వాడు.చిన్న వయసులోనే ఒక కిరాణా ...మరింత చదవండి

2

మట్టిలో మాణిక్యం నిజ జీవిత కథ సిరీస్ - 2

ఈ కథ రాయడానికి ముఖ్య ఉద్దేశం. గొప్ప గొప్ప వారి జీవిత చరిత్రలు తెలుసుకోవడం కాకుండా వెనుకబడిన వర్గాల వారి జీవిత చరిత్ర తెలుసుకొని వారి విధానం ఎలా ఉంది .వారు పడిన బాధలు ఎలా ఉన్నాయి. వారు వారి జీవితంలో వచ్చే ఆటుపోటులను అడ్డుకొని ఎలా నిలబడ్డారు. అని అందరికీ తెలియడం కోసమే ఈ మట్టిలో మాణిక్యం కదా రాస్తున్నాను.భాగం 1 తరువాత,అమ్మానాన్న దగ్గర నుంచే మేము పేకాట ఆడడం నేర్చుకున్నాము.అందరి దృష్టిలో అది ఒక వ్యసనం లాంటి ఆట కానీ మాకు మాత్రం అది ఒక కాలక్షేపం కోసం ఆడే ఆట మాత్రమే.పని లేని టైం లో గుడిసెల వుండే మిగితా వారు డబ్బులు పెట్టీ పేకాట ఆడేవారు .ఇక్కడ వున్న వారు అందరు వారి వయసు తో సంబంధం లేకుండా అందరూ ఆడే వారు.ఈ ఆట అమ్మ వాళ్ళ దగ్గరి నుంచి నేర్చుకున్నాం. కానీ నాన్నకు ...మరింత చదవండి