జానూ ఇంకెంత సేపు ముస్తాబు అవుతావు తల్లీ... త్వరగా రామ్మా నీకోసం అక్కడ అందరూ ఎదురుచూస్తుంటారు అంటూ తన పన్నిండేళ్ల కూతుర్ని తొందర చేస్తుంది ప్రసూన...... పదే పది నిముషాలు అమ్మ... వచ్చేస్తాను అంటూ పైరు పచ్చ పట్టు లంగాకి.. బుంగరెట్టలు ఉన్న మిరపపండు రంగు జాకెట్ వేసుకొని మువ్వల పట్టీలు చేస్తున్న శబ్దం చేస్తుంటే అటు ఇటు తిరుగుతూ సమాధానం ఇస్తుంది జానూ....... ఎమ్ వెతుకుతున్నావ్ తల్లి... మాకు చెప్తే చూస్తాం కదా అంటూ కూతుర్ని చూస్తూ అడుగుతారు జగదీష్ గారు......
జానకి రాముడు - 1
జానూ ఇంకెంత సేపు ముస్తాబు అవుతావు తల్లీ... త్వరగా రామ్మా నీకోసం అక్కడ అందరూ ఎదురుచూస్తుంటారు అంటూ తన పన్నిండేళ్ల కూతుర్ని తొందర చేస్తుంది ప్రసూన......పదే నిముషాలు అమ్మ... వచ్చేస్తాను అంటూ పైరు పచ్చ పట్టు లంగాకి.. బుంగరెట్టలు ఉన్న మిరపపండు రంగు జాకెట్ వేసుకొని మువ్వల పట్టీలు చేస్తున్న శబ్దం చేస్తుంటే అటు ఇటు తిరుగుతూ సమాధానం ఇస్తుంది జానూ.......ఎమ్ వెతుకుతున్నావ్ తల్లి... మాకు చెప్తే చూస్తాం కదా అంటూ కూతుర్ని చూస్తూ అడుగుతారు జగదీష్ గారు......మామ కార్ కోసం మొన్న కొత్త కీ చైన్ కొన్నా నాన్న... అదెక్కడ పెట్టానో గుర్తు రావట్లేదు.. అదే వెతుకుతున్నా అంటూ హాల్లో కప్ బోర్డ్స్ అన్నీ చూస్తుంటుంది జానూ..అది నువ్వు స్కూటర్ లో పెట్టి మరిచిపోతే నేను జాగ్రత్త చేశా.... వెళ్లి నా టేబుల్ సొరుగులో చూడు ఉంటుంది అని కూతుర్ని రూమ్ కి పంపించి అన్నీ రెడీ నే ...మరింత చదవండి