ఈ కథ పూర్తిగా కల్పితం.. కళ్యాణ మండపం... ఈ సిటీ లోనే పెద్ద పెద్ద బడా బాబుల్ని భరించే అతిపెద్ద కళ్యాణ మండపం. రాష్ట్రంలోనే రెండు పెద్ద బిజినెస్ కుటుంబాల మధ్య జరుగుతున్న వివాహ వేడుక ఇది.అంగరంగ వైభవంగా అలంకరించి ఉంది ఎటు చూసినా రెండు కుటుంబాల వైభోగం కనబడుతుంది.కళ్యాణ మండపం చుట్టూ ఫుల్ గా సెక్యూరిటీ ఉంది.ప్రతి ఒక్కరినే బాగా చెక్ చేసి గాని లోపలికి పంపడం లేదు. పెళ్ళికొడుకు మండపంలో కూర్చుని వర పూజ చేస్తున్నాడు. పెళ్ళికొడుకుని చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు. ఆరడుగుల అందగాడు, చురకత్తుల లాంటి చూపులు, సమ్మోహనపరిచే చిరునవ్వు, సిల్కీ హెయిర్, చుక్కల్లో చంద్రుడు వలె మెరిసిపోతున్నాడు.
Full Novel
పాణిగ్రహణం - 1
ఈ కథ పూర్తిగా కల్పితం..కళ్యాణ మండపం...ఈ సిటీ లోనే పెద్ద పెద్ద బడా బాబుల్ని భరించే అతిపెద్ద కళ్యాణ మండపం.రాష్ట్రంలోనే రెండు పెద్ద బిజినెస్ కుటుంబాల జరుగుతున్న వివాహ వేడుక ఇది.అంగరంగ వైభవంగా అలంకరించి ఉంది ఎటు చూసినా రెండు కుటుంబాల వైభోగం కనబడుతుంది.కళ్యాణ మండపం చుట్టూ ఫుల్ గా సెక్యూరిటీ ఉంది.ప్రతి ఒక్కరినే బాగా చెక్ చేసి గాని లోపలికి పంపడం లేదు. పెళ్ళికొడుకు మండపంలో కూర్చుని వర పూజ చేస్తున్నాడు. పెళ్ళికొడుకుని చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు. ఆరడుగుల అందగాడు, చురకత్తుల లాంటి చూపు ...మరింత చదవండి
పాణిగ్రహణం - 2
గుమ్మం దగ్గర నిలబడిన నూతన దంపతులను ఆపి పేర్లు చెప్పి రమ్మంటారు. దానికి వరుడు చిన్నగా నవ్వి, విక్రమ్ జై సింహ అనే నా భార్య అయిన శిల్పతో వచ్చాను అని చెబుతాడు. వధువు వంక చూసి ఇప్పుడు నువ్వు చెప్పు వదిన అనగానే, వధువు కంగారుగా విక్రమ్ చేయి పట్టుకుంటుంది. దానికి విక్రమ్ చిన్నగా చేతిని ప్రెస్ చేసి రిలాక్స్ అని చెప్పి, విక్రమ్ వాళ్ళ అమ్మగారి వంక చూస్తాడు. లలితగారు నవ్వుకుంటు వచ్చి శిల్పా మౌనవ్రతంలో ఉంది లోపలికి రానివ్వండి అని చెబుతారు.ఇందిరా దేవి గారు అక్కడికి వచ్చి అప్పుడే కోడల్ని వెనకేసుకొస్తున్నావా అని అడుగుతారు. దానికి లలితగారు మీరు నాకు సపోర్ట్ ఇచ్చినట్టు శిల్ప కు నేను ఇస్తున్నాను అత్తయ్య గారు అని చెబుతుంది.దానికి ఇందిరాగారి ముఖంలో గర్వంతో కూడిన చిరునవ్వు వస్తుంది. భార్య లౌక్యం చూసిన లలిత భర్త గారైన ...మరింత చదవండి