సున్నితమైన చిన్న ప్రేమ కథ. అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అని ఆశిస్తున్నాను. చదివి మీ అభిప్రాయం కామెంట్స్ లో ఇవ్వండి. మీకు నచ్చితే మరిన్ని కథలను అందిస్తాను.. ఇట్లు మీ వర్ణ. *************** అది ఒక చిన్న గ్రామం. పరువు ప్రతిష్ట లకు ప్రాణం ఇచ్చే పౌరుషాలు, కులము, మతము, కట్టుబాట్లు, ఆచారాలు ఇంకా పొలిమేరలు దాటని గ్రామం. కంటికి కనిపించని కంచెలతో గీతలు గీసుకుని, గడపలలో మడికట్టుకు తిరిగే పెద్ద వాళ్లకు పేరుగాంచిన గ్రామం. వదిలేసి ఎగిరి పోలేని ఒక ఆడపిల్ల మనసును కట్టటి చేస్తున్న గ్రామం. తెగించి తీసుకుపోలేని ఒక మగవాడి పౌరుషాన్ని ప్రశ్నిస్తున్న గ్రామం. అన్నిటి నడుమ కదిలిపోతున్న ఓనాటి సాయంత్రం..

Full Novel

1

ప్రేమలేఖ..? - 1

సున్నితమైన చిన్న ప్రేమ కథ. అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అని ఆశిస్తున్నాను. చదివి మీ అభిప్రాయం కామెంట్స్ లో ఇవ్వండి.మీకు నచ్చితే మరిన్ని కథలను అందిస్తాను.. మీ వర్ణ.అది ఒక చిన్న గ్రామం.పరువు ప్రతిష్ట లకు ప్రాణం ఇచ్చే పౌరుషాలు, కులము, మతము, కట్టుబాట్లు, ఆచారాలు ఇంకా పొలిమేరలు దాటని గ్రామం.కంటికి కనిపించని కంచెలతో గీతలు గీసుకుని, గడపలలో మడికట్టుకు తిరిగే పెద్ద వాళ్లకు పేరుగాంచిన గ్రామం.వదిలేసి ఎగిరి పోలేని ఒక ఆడపిల్ల మనసును కట్టటి చేస్తున్న గ్రామం. తెగించి తీసుకుపోలేని ఒక మగవాడి పౌరుషాన్ని ప్రశ్నిస్తున్న గ్రామం.అన్నిటి నడుమ కదిలిపోతున్న ఓనాటి సాయంత్రం..నిమ్మ పండు రంగులో మెరుస్తున్న వేసవి సాయంత్రం. పచ్చటి పొలాల మీదా, గుడిసెల మీదా ఆ కాంతి వెదజల్లుతూ, ముద్దుగా తాకుతుంది.చుట్టూ పూల వాసన, ఆకుల మర్మరాలు గాలిలో తేలుతూ ప్రేమను, తపనను నింపుకున్న గుండెకి వాటి సవ్వడితో సంగీతాన్ని జోడిస్తున్నాయి.ఆ పచ్చటి పొలాల్లో గల ...మరింత చదవండి

2

ప్రేమలేఖ..? - 2

తన ప్రమేయం లేకుండానే సన్నగా వణికి పోతుంది లీలా.తలుచుకుని బ్రతకడానికి మనకి కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి. చిన్నపిల్లలం కాదు లీలా.. అలా అని ఎవరిని బాధ నాకు లేదు. ఇంకా నిన్ను దూరం చేసుకొని నరకం భరించే శక్తి కూడా నాకు లేదు.ఇది నా మనసు తీసుకో.. నీ నిర్ణయం కోసం ఎదురు చూస్తుంటాను అని కచ్చితంగా చెప్పిన అతని మాటలకి వణుకుతున్న చేతితో పేపర్ కవర్ అందుకుంది లీలా.నిమిషాల క్రితం నీరెండలో బంగారు బొమ్మలా మెరుస్తున్న ఆమె రూపం ఇప్పుడు మక్కెన పువ్వులా అలసిపోయిన ఎరుపు రంగులో కనిపిస్తుంటే చాలా కష్టంగా ఉంది ఆనంద్ కి.ఏమన్నా చెప్పాలా అని చిన్న గొంతుతో ఆర్థిగా ఆమెనే చూస్తూ అడిగాడు.జీవిత కాలానికి సరిపడా చెప్పాలన్నంత ఆశ అయితే గుండె నిండుగా ఉంది.పెద్దవాళ్లని ఎదిరించి అడుగు ముందుకు వేయలేని కట్టుబాటుకు లోంగిన ఆమె.. పెదవి కదపలేదు.చిన్నగా తల మాత్రమే అడ్డంగా కదుపుతూ ఆనంద్ ...మరింత చదవండి