మైథిలితో మాట్లాడిన అనంతరం గంగాధర్ రావడాన్ని గమనించిన ప్రభ అక్కడి నుంచి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. అయితే గంగాధర్ చూపులు అతడిని అనుకోకుండా తనవైపు ఆకర్షించాయి. ఆయన కళ్లలో ఏదో ప్రత్యేకమైన కాంతి కనిపిస్తోంది. ఆ చూపుల్లో తెలియని ఆత్మీయత, ఆప్యాయత తొణికిసలాడుతున్నాయి.గంగాధర్ నడుచుకుంటూ వస్తున్న తీరును గమనిస్తుంటే, ఎప్పటినుంచో పరిచయమున్న ఆత్మీయుడిని పలకరించడానికి వస్తున్నట్లుగా అనిపించింది. ఆయన అడుగులు ప్రభకు చేరువయ్యే కొద్దీ ఆ ఆప్యాయత మరింత స్పష్టమైంది.దగ్గరకు వచ్చిన గంగాధర్ చిరునవ్వుతో రెండు చేతులూ చాపారు. ఏదో అనుకున్నట్లుగా ఒక్క క్షణం ఆగి, చేతులను కిందికి దించి ప్రభ భుజంపై ఆప్యాయంగా చేయి వేశారు.ఆ స్పర్శలోని ఆత్మీయత ప్రభకు కూడా తెలియకుండానే మనసును తాకింది."ప్రభా! నిజంగా నిన్ను చూస్తుంటే నాకు చాలా..." అంటూ ఏదో చెప్పబోయారు. ఇంతలో ఆయన భార్య అక్కడికి రావడంతో ఒక్కసారిగా మాటను ఆపేశారు. తన చేతిని ప్రభ భుజం మీద నుంచి తీసి,"బాబూ! ఇదిగో..." అంటూ