భరణిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మైథిలి అతనికి చికిత్స చేయడంతో ప్రభకు తెలియకుండానే అలసట ఆవరించింది. శరీరమంతా నీరసించినట్టుగా అనిపించడంతో కాసేపు విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాడు. అయితే, రాత్రి భోజనానికి వెళ్లి కూర్చున్నాకే తన ఆకలిని గుర్తించినట్టుగా మెల్లగా అన్నం తినడం ప్రారంభించాడు.ఇంతలో అనుకోకుండా పొలమారింది.వెంటనే మైథిలి తల్లి అతని దగ్గరకు వచ్చి, ఆప్యాయంగా నీళ్లు అందిస్తూ, దగ్గరుండి వడ్డించసాగింది.ఆమె చూపిస్తున్న ఆప్యాయతలో ఏదో తెలియని అనుబంధం కనిపించింది ప్రభకు. క్షణకాలం అతని మనసు తన తల్లి జ్ఞాపకాలలోకి జారిపోయింది.అమ్మ చేతి ముద్దలో ఆకలి తీరుతుంది. అమ్మ చూపించే ప్రేమలో మనసు అలసట తీరుతుంది. ఆ ప్రేమకు దూరమైనప్పుడే దాని విలువ మరింతగా తెలుస్తుంది.‘అమ్మ ఇప్పుడు ఏం చేస్తుందో? నా కోసం ఎదురుచూస్తూ ఉంటుందేమో!’ అనుకున్నాడు.కానీ, ఆ ఆలోచనను అక్కడితో ఆపేసి మౌనంగా భోజనం ముగించి బయటకు వచ్చిన ప్రభ వెనకే గంగాధర్ కూడా నడిచాడు.“బాబూ! ఇప్పటికే బాగా పొద్దుపోయింది. అదిగో,