ప్రణయ గీతిక - 49

పెళ్లిచూపుల నుంచి తిరిగొచ్చిన ప్రభ మంచంపై పడుకున్నాడు. మనసులో చెప్పలేనంత కోపం ఉప్పొంగుతోంది. ఎలాగోలా ఆ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలని ప్రయత్నిస్తున్నా, అతనికి సాధ్యం కావడం లేదు. ఆ కోపాన్ని ఎవరిమీద చూపించాలో తెలియక తనలో తానే సతమతమవుతున్నాడు.ఏ సమస్యనైనా సునాయాసంగా పరిష్కరించగలిగే నేను, ఇప్పుడు నా మనసులోని ఈ అలజడిని ఎందుకు అదుపు చేసుకోలేకపోతున్నాను?ప్రేమ! చూడటానికి రెండు అక్షరాల చిన్న పదమే. కానీ, దాని ప్రభావం ఎంత బలమైనది! అయస్కాంతంలా మనసును తనవైపు లాగేసుకుంటుంది. ఆ అమ్మాయి ఉత్తర ధ్రువమైతే, నేను దక్షిణ ధ్రువంలా తనవైపు ఆకర్షితుడినవుతున్నానా? అందుకేనా ఈ ఆకర్షణ?గీతికా! నా జీవితంలో ఇప్పటివరకు దేనికోసమూ ఇంతగా మదనపడలేదు. ఎందుకంటే, నాకు ఏం కావాలో, ఏది మంచో అమ్మే చూసుకుంది. నా అవసరాలను తీర్చింది. నా జీవితానికి ఒక దారిని చూపించింది.పాపం! ఎంత ఆశగా ఎదురుచూసి ఉంటుందో! పెళ్లిచూపుల నుంచి వచ్చాక నేను ఏదో ఒక శుభవార్త చెబుతానని