ప్రభా ఊరికి వెళ్లడానికి రెడీ అవుతున్నప్పుడు వచ్చిన చరిత“ప్రభా! నీకు డబ్బేమైనా అవసరమైతే నన్ను అడగరా. నువ్వు అలా ఫీల్ అవ్వకు” అంటూ చరిత ఆప్యాయంగా చెప్పింది.“ఇల్లు కొనేటప్పుడు చాలా అత్యవసరమైతే బావను, నిన్ను అడగక తప్పదు. కానీ నేను అడగకముందే బావ లక్ష రూపాయలు నా అకౌంట్లో వేశారు. ఇక ఇప్పుడు నిన్ను కూడా డబ్బులు అడగడం నాకు ఇష్టం లేదు” అన్నాడు ప్రభ.“అవునా! అయితే మంచి పని చేశారులే. ఎలాగైనా తొందరగా పనులన్నీ పూర్తి చేసి అమ్మను సొంత ఇంటికి తీసుకెళ్లరా!” అంది చరిత.“అలాగే అక్కా! బాబును జాగ్రత్తగా చూసుకో. అమ్మను రెడీగా ఉండమని చెప్పు. మనం బయలుదేరాలి” అన్నాడు ప్రభ.“ప్రభా! ఒక్క నిమిషం ఆగరా! ఎవరో ఒకతను ఫోన్ చేశాడు. అతని పేరు మర్చిపోయాను. ఇంటి అడ్రస్ చెబుతాను” అంటూ చరిత చెప్పడంతో ప్రభ అయోమయంగా చూశాడు.“ఏంటక్కా! ఇల్లేంటి? అడ్రస్ ఏంటి?” అని అడిగాడు.“అదేరా! నాకు ఫోన్