“సార్ ఎవరితో మాట్లాడారు? నీ ఒక్కదానితో తప్ప...” అని భవ్య అనడంతో వెంటనే కీర్తి,“హలో పాపా... ఆగు! నాతో ఎప్పుడూ మాట్లాడారు ఆయన?” అని అడుగుతుంది.“అంటే... నిన్ను ఎప్పుడూ తిడతారు కదా... దాన్ని మాట్లాడడం అంటారు మీ ఊరిలో?” అని వెటకారంగా అంటుంది కీర్తి.“నీతో అలా అయినా మాట్లాడుతారు కదా...” అని భవ్య అనడంతో ప్రియ ఒక్కసారిగా గట్టిగా నవ్వుతుంది.ప్రియ అలా నవ్వడంతో కీర్తి కోపంగా ప్రియ వైపు చూస్తుంది.కీర్తి కోపాన్ని అర్థం చేసుకున్న ప్రియ, బలవంతంగా వస్తున్న నవ్వుని ఆపుకుని మనసులోనే నవ్వుకుంటుంది.“అయినా ఆ సార్‌ని ఎలా లవ్ చేశావే?” అని కీర్తి చిరాకుగా భవ్యను అడుగుతుంది.“ఏమో తెలీదే... ఆరు నెలల నుంచి ఆ సార్ అంటే నాకు ఇష్టం. ఆ సార్ తప్ప ఇంకెవ్వరూ నా మనసులోకి రావడం లేదు. విరాట్ సార్‌ని చూడడం కోసం నేను కాలేజీకి వస్తున్నానంటే తెలుసా?ఆ సార్ కోసం నేను నా గుండెలో