అలా ఆర్య అలాగే విష్ణు అలాగే కిరణ్ వాళ్ళ అన్న రంగ మహా స్మశాన వాటిక కి వెళుతారు. అక్కడ సమాధి కోసం గుంతలు తవ్వే వారిని రంగా పిలుస్తాడు. అందులో ఒక సారి పేరు నాయక్ తరువాత రంగ కి అలాగే నాయక్ కి మధ్య సంభాషణ జరుగుతుంది.( రంగ ) : చూడు బాబు ఇక్కడ ఉన్న సమాధిని తోవ్వాలి.అని రంగ నాయక్ ని అడుగుతాడు.( నాయక్ ) : తవ్వుదాం సార్ కానీ ఎందుకు తోవ్వాలి సార్ ఈ సమాధి చాలా రోజుల నుంచి ఇక్కడే ఉంది. ఇప్పుడు హఠాత్తుగా మీరు ఏమో ఈ సమాధిని తవ్వు అంటున్నారు. ఎందుకు సార్ అని నాయక్ రంగ ని అడుగుతాడు.( రంగ ) : ఇవన్నీ నీకు అనవసరం. ఈ సమాధి మా తమ్ముడు దే. మాకు కొంచెం అత్యవసరం వలన ఈ సమాధిని తొవ్వని అంటున్నాం. నేను చెప్పింది మాత్రమే