ప్రణయ గీతిక - 30

  • 858
  • 297

లవ్లీ గురించి పప్పు అడిగినప్పుడు   చెప్పిన తర్వాత  మంచికాలం రావాలంటూ కూర్చుంటే ఎప్పటికీ రాదు. పాజిటివ్ థింకింగ్ ఉంటేనే కచ్చితంగా వస్తుంది. అది ఆ అమ్మాయికి అర్థం కావట్లేదు అని బాధపడ్డాడు ప్రభ. పోనీ లేరా తను చాలా బాధలో ఉంది అని పప్పు అనడంతో బాధ ఉందని చచ్చేవరకు బాధపడుతూనే  ఉండాలా,?  బాధను దిగ మింగి ఆనందాన్ని వెతుక్కొని జీవితాంతం బతికి చావచ్చు కదా  "అని ఈసారి ప్రభా వాయిస్ రైజ్ అయ్యింది.ఆమ్మో! వీడు చాలా ఎమోషనల్ గా ఉన్నట్టున్నాడు అనుకుని " ప్రభా ! ఆ అమ్మాయి కచ్చితంగా అర్థం చేసుకుంటుందని నేను అనుకుంటున్నాను. పాపం బతికినా శవంళా మిగిలిపోయింది. తేరుకోవాలంటే కాస్త సమయం అవసరం అన్నాడు పప్పు. సమయం జీవితాంతం ఉంటుంది.కానీ జీవితం చాలా చిన్నది. అసలు తను నా గురించి ఏమనుకుంటుంది.నన్ను గడ్డి పోచలా తీసి పారేసింది.  "నువ్వే చెప్పావుగా బతికినా  శవంలా మిగిలిందని మరి బతికిన వారితో