లాయర్ లవ్లీ వైపు చూడడంతో మళ్లీ చెప్పడం ప్రారంభించింది లవ్లీ. శ్రీహరి మనసు పడ్డ అమ్మాయి పనిచేసేది కూడా ఈ కంపెనీలోనే శ్రీహరి తనని చూసిన మొదటి రోజు నుండి అతనిలో మార్పు గమనించాను. నేను చివరి రోజు గెస్ట్ హౌస్ కి వెళ్ళిన రోజు కూడా నాతో ఇంతకుముందులా ఉండింది లేదు అందుకే ..... అని లవ్లీ ఏదో చెప్పబోగా అందుకే "శ్రీహరిని చంపాలని ప్లాన్ చేసావా?" అన్నాడు లాయర్ కల్పించుకుని. చి!చి! నేనెందుకు అతనిని చంపాలనుకుంటాను. అసలు నాకు ఆ ఉద్దేశమే లేదు. ఎందుకంటే అతను నన్ను ఎప్పుడు ఏ విధంగా ఇబ్బంది పెట్టలేదు. మరి లక్షని కోటిగా ఎందుకు మార్చావు. ఆ సమయంలో నాకు డబ్బు చాలా అత్యవసరం అది కాక అతనికి నాలోని నా మీద అభిరుచి తగ్గింది కాబట్టి సెటిల్ అవ్వాలని అందుకే అలా చేశాను. అయితే శ్రీహరి ఎలా చనిపోయాడు. అది నాకు తెలీదు. పోనీ నీతో పని చేసే అమ్మాయి