ప్రణయ గీతిక - 21

  • 201

ప్రాజెక్టు ప్లాన్ సక్సెస్ అయినందుకు ప్రభనీ పిలవకుండా పప్పుకి,  ఇంకా తన కొలీగ్స్ కి చిన్న ట్రీట్  ఇచ్చింది గీతిక. మధుర హోటల్లో నుండి ఇంటికి వచ్చిన గీతికకి రాత్రంతా నిద్ర పట్టలేదు . పదే పదే రాణి మేడం భర్త కృష్ణ మురళి చెప్పింది గుర్తుకొస్తోంది. ఏం చేయాలో ఏమో అర్థం కావడం లేదు. ఆ టెన్షన్ తో రాత్రి కొన్ని డ్రాయింగ్ షీట్స్ తీసుకొని ఏవేవో డ్రాయింగ్ వేస్తూ అలసిపోయి ఎప్పటికో నిద్రపోయింది. తర్వాత రోజు ఆదివారం కావడంతో ఎప్పుడూ ఆలస్యంగా లేచే గీతిక తొందరగా లేచి మళ్లీ ఆలోచనలో పడింది. " సర్ నా ప్రాజెక్టు సక్సెస్ అయిందన్న సంతోషం ఎంతో సేపు నా మనసులో నిలవలేదు.  మీరు చెప్పిన మాటలతో నా మనసు సతమయితమైపోతోంది." అబ్బా!  ఏం చేయాలి అంటూ అటూ ఇటూ తిరుగుతుంటే కురలకి పెట్టిన క్లిప్ జారడంతో కురులు విచ్చుకోగా విసుగుతో మళ్లీ ముడేసుకుని