ప్రణయ గీతిక - 14

  • 387
  • 120

శైలుని మాట్లాడించడానికి వెళ్లి న గీతికకి ప్రభ ఎదురుపడేసరికి జరిగిన ఆ సంఘటనతో ఇంటికి రాగా తాతయ్య జేజీ ల మాటలు విని నేను మీరు అనుకున్నట్టు ఎప్పటికీ ఉండను నాకు నచ్చిన విధంగానే నేను ఉంటానని నిర్ణయించుకుని జాబ్ చేయడానికి  మనసుని సిద్ధం చేసుకుంది గీతిక. ఉదయం అలారం మ్రోగించినట్టు తన మనసు 5 గంటలకి మేలుకువరానిచ్చేసరికి లేచి , తల స్నానం చేసి, గదిలోకొచ్చి బెడ్ పై తీసిపెట్టిన రెండు జతల డ్రస్సులలో ఇదా , అదా ఏది వేసుకోను?  అసలే అవసరం   ఇవాళ మొదటిసారి జాబ్ కి వెళ్తున్నాను  అంటూ పెదవి మీద చూపుడువేలు పెట్టి క్షణం ఆలోచించి గ్రీన్ రంగు డ్రెస్ సెలెక్ట్ చేసి వేసుకుని,  అద్దం ముందు నిలబడి  సింపుల్గా రెడీ అయి, చిన్న బొట్టు పెట్టి జుట్టుదువ్వుతూ కురులని వదులుగా వేసుకొని ఓ క్లిప్ పెట్టాలా , లేదా పోనీ ఇలా రబ్బర్ బ్యాండ్