ప్రభ గీసిచ్చిన డ్రాయింగ్ చూసిన గీతిక ముఖంలో మార్పు రావడం గమనించిన జేజి, తాతయ్యలు చాలా సంతోషిస్తారు.ఆదివారం కావడంతో తర్వాత జరగబోయే ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలో జాగ్రత్తగా చూసుకుంటోoది గీతిక. తన స్నేహితురాలు అయిన హిత విప్రో కంపెనీలో కొత్తగా జాయిన్ అయింది కాబట్టి తను ఎలాంటి సహాయం చేయడానికి సిద్ధంగా లేదని అర్థం చేసుకుని తనే జాగ్రత్తగా విషయాలను చదువుకుంటోoది. అయినా తన సూపర్ సీనియర్ ఒక కంపెనీలో జాబ్ చేస్తూ ఉండడం వలన తను రికమండేషన్ చేస్తానని చెప్పడం గుర్తుకు రావడంతో వెళుతుంది గీతిక. కంపెనీ కాంపౌండ్ గేటు దాటి లోపలికి వెళ్ళిన గీతిక చుట్టూ చూస్తే అతను అక్కడికి రెండు అడుగుల దూరంలో ఒక అమ్మాయి తో మాట్లాడుతూ కనిపించగా కాస్త వెనక్కి నిలబడుతుంది గీతిక. సూపర్ సీనియర్ దగ్గర నిలబడిన అమ్మాయి "ఏరా! ఆ గీతిక అంటే నీకు అంత ఇదా...." అని ఇంకా ఏదో చెప్పబోతుండగా,