వెంటాడే నీడలు - 33

  • 303
  • 117

వెంటాడే నీడలు ( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పారానార్మల్ థ్రిల్లర్) కొట్ర శివ రామ కృష్ణ కళ్ళవెంట నీళ్లు కారూతూవున్నాయి భుజంగరావు కి, మాలతి కి. "ఏంటమ్మా, ఏంటి చూస్తున్నారు మీరంతా ఇక్కడ?" అక్కడికి వచ్చి అడిగింది సారిక. "ఏం లేదమ్మా, పద మనం ఇక్కడనుండి వెళ్ళిపోదాం." సారిక ని అక్కడనుండి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తూ అంది మాలతి. అక్కడనుండి వెళ్లబోతూన్నదల్లా, సింహరాజు వైపు చూసింది సారిక. ఆ మొహం లో ఎదో మార్పు కనిపించింది. ఎదో గుర్తు చేసుకునేటటువంటి ప్రయత్నం కనిపించింది. "నువ్వు.........నువ్వు రాజు వి కదా." "అవును మల్లికా. నేను నీ సింహరాజు ని." చిరునవ్వుతో అన్నాడు సింహరాజు. "ఎంతకాలమైంది నిన్ను చూసి." సింహరాజు దగ్గరికి వెళ్లి గట్టిగా కౌగలించుకుని, రెండు బుగ్గలమీద ముద్దుపెట్టుకుంది. "నువ్వెక్కడికి వెళ్లిపోయావ్? ఇంతకాలం ఏమైపోయావ్?" "నేను ఎక్కడికీ వెళ్లిపోలేదు. ఏమీ అయిపోలేదు. ఇక్కడే వున్నాను." చిరునవ్వుతో అన్నాడు సింహరాజు. "నువ్వు....