వెంటాడే నీడలు - 32

  • 168

వెంటాడే నీడలు ( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పారానార్మల్ థ్రిల్లర్) కొట్ర శివ రామ కృష్ణ "మల్లికా........" ఉలిక్కిపడి బెడ్ మీద లేచి కూచుంది మాలతి. మొట్టమొదటిసారిగా తన జీవితం లో సారిక కి బదులుగా మల్లిక ని తలుచుకుంది. "......... నన్ను క్షమించు తల్లీ. నీ జీవితం లో అంత అన్యాయం జరగడానికి కారణం అయ్యాను." మల్లికే సారిక గా పుట్టిందా? లేకపోతె మల్లిక కేవలం సారిక స్ప్లిట్ పెర్సనాలిటీ మాత్రమేనా? ఎందుకనో తనకా సింహరాజు చెప్పింది నమ్మాలనిపిస్తూవుంది. మల్లికే సారిక అని ఆలోచిస్తూంటే, మల్లిక మీద వున్న ద్వేషం పటాపంచలు అయిపోయింది.  గాభరాగా పక్కన చూస్తే భుజంగరావు కనిపించలేదు. 'ఈ సమయం లో ఎక్కడకి వెళ్ళివుంటారబ్బా' అనుకుంటూ బెడ్ దిగి కిందకి వచ్చింది. రూమ్ బయటకి రాగానే నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు భుజంగరావు. మాట్లాడకుండా ఆయన్నే అనుసరిస్తూ వెళ్ళింది. నెమ్మదిగా గ్రౌండ్ ఫ్లోర్ లోకి