వెంటాడే నీడలు - 31

  • 126

వెంటాడే నీడలు ( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పారానార్మల్ థ్రిల్లర్) కొట్ర శివ రామ కృష్ణ "మనం వున్నది మెంటల్ కేర్ లో. అదీ కాకుండా ఇంతమందిమి వున్నాం కాబట్టి తను వయొలెంట్ గా మారినా మనం కంట్రోల్ చెయ్యగలం. కాబట్టి ఏం మాట్లాడుకున్నారో చెప్పండి. నాకూ చాలా ఆతృతగా వుంది తెలుసుకోవాలని." ప్రమీల కూడా అంది.     దానితో శ్రవణ్ సింహరాజు, యస్మణి తమకి చెప్పినదంతా క్లియర్ గా చెప్పేసాడు. శ్రవణ్ చెప్పేదంతా సారిక చాలా ఇంట్రెస్టింగా వింది కానీ, చివరివరకూ విన్నతరువాత కూడా తనలో ఎటువంటి మార్పు రాకపోవడం తో అందరూ రిలాక్స్డ్ గా ఊపిరి పీల్చుకున్నారు. "నువ్వు పనిమనిషవనే అనుకున్నాను. కానీ నాకు అక్కవని తెలుసుకోలేకపోయాను. ఐ యామ్ సారీ." శ్రవణ్ అన్నాడు. "చిన్నపిల్లవని కూడా చూడకుండా నిన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టాను. ఇంట్లోనుండి పారిపోయేలా చేసాను. చివరికి నీ చావుకి కారణం అయ్యాను.