వెంటాడే నీడలు ( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పారానార్మల్ థ్రిల్లర్) కొట్ర శివ రామ కృష్ణ తన విల్ పవర్ అంతా వుపయోగించి, ఆ కోరికకి లోబడకుండా నిద్రపోవడానికి ప్రయత్నించింది. ఎప్పుడు నిద్రపట్టిందో తెలియదు కానీ తెల్లవారి లేచేసరికి మాత్రం సమయం ఎనిమిది అయిపోయింది. &&& "సమీర గారూ, మీతో ప్రైవేట్ గా మాట్లాడ్డానికి నాకు ఒక రెండు నిమిషాల సమయం ఇస్తారా?" సమీర మెంటల్ కేర్ కి బయలుదేరి వస్తూండగా దగ్గరికి వచ్చి అన్నాడు అభినవ్. అప్పటికే ఆలస్యమైంది. 'కెన్ ఇట్ వెయిట్ టిల్ ఈవెనింగ్?' అనబోయి ఆగిపోయింది. అభినవ్ తనని ఇలా అడగడం ఇదే మొదటిసారి. అందులోనూ తన మొహం లో ఏదో ఆందోళన కూడా కనిపిస్తూ వుంది. ఏదో ముఖ్యమైన విషయమే అయివుంటుంది. "రండి నా రూమ్ లో కూచుని మాట్లాడుకుందాం." అప్పటికి అరవింద్ బాత్ రూమ్ కి వెళ్లడం వల్ల, తనని