వెంటాడే నీడలు - 27

  • 291
  • 90

వెంటాడే నీడలు ( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పారానార్మల్ థ్రిల్లర్) కొట్ర శివ రామ కృష్ణ "ఎస్, సర్." నిరంజన్ అన్నాడు. "ఈ మెంటల్ కేర్ లో అడ్మిట్ అయిన ఒక అమ్మాయి అప్పుడప్పుడు ఆ బొమ్మ గీస్తూ వుంది. తానేమీ ఆర్టిస్ట్ కాదు. తనకి బొమ్మలు గీసే అలవాటు లేదు అయినా ఆ బొమ్మ తనెందుకు గీస్తూ వుందో తనకే తెలియడం లేదు. ఎవరూ కూడా ఆ బొమ్మ గురించి ఏమీ చెప్పలేకపోతున్నారు. మీకేమన్న ఐడియా ఉంటుందేమోనని............." నిరంజన్ పూర్తిచెయ్యకుండానే గట్టిగా నవ్వాడు యస్మణి. "నేను పారానార్మల్ మీద రీసెర్చ్ చేశానని నీకు తెలుసు. అందులో భాగంగా కొందరు బాడ్ గాడ్స్ గురించి కూడా రీసెర్చ్ చేసాను. అందులో ప్రధానమైన బాడ్ గాడ్ 'కబుసా '. అని ఆగాడు. "ఆ కబుసా కి ఈ బొమ్మ కి ఏమిటి సంభందం సర్?" సమీర అడిగింది. "ఆ