వెంటాడే నీడలు ( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పారానార్మల్ థ్రిల్లర్) కొట్ర శివ రామ కృష్ణ "అసలు నాకలా బిహేవ్ చేసిన విషయమే తెలియదు." ఇంకా అయోమయం ఎక్స్ప్రెషన్ తోనే వుంది సారిక. “నన్నెంతగానో ప్రేమించే నా పేరెంట్స్ ని, గ్రాండ్ పా ని నేనుచంపాలనుకోవడం కన్నా పెద్ద విడ్డూరం ఏం ఉండదు. కలలో కూడా నేను వాళ్ళకి అపకారం చెయ్యాలనుకోను." "ఆల్రైట్. మరి ఆ ఓబులేసు విషయం. వాడిమీద నువ్వొకసారి అటాక్ చేసిన విషయం నాకు తెలుసు. ఇప్పుడు వాడిని చంపేశానని చెప్పావు." సమీర అంది. "నేను వాడిని చంపేంత అటాక్ చేసాను. కానీ వాడు చచ్చిపోలేదు. బతికే వున్నాడు." "ఎనీ హౌ ఎప్పుడన్నా వాడు నీతో మిస్-బిహేవ్ చేశాడా? నీకు కోపం తెప్పించేలా ఎమన్నా చేశాడా?" నిరంజన్ అడిగాడు. "నో, నెవెర్." సారిక గొంతు వెహిమెంట్ గా వుంది. "వాడు మా కుటుంబానికి చాలా