వెంటాడే నీడలు - 19

వెంటాడే నీడలు ( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పారానార్మల్ థ్రిల్లర్) కొట్ర శివ రామ కృష్ణ "అప్పుడెప్పుడూ  చెప్పాలనిపించలేదు. ఇప్పుడూ చెప్పకపోతే ఎప్పటికీ చెప్పలేనేమో అనిపిస్తూంది. అందుకనే చెప్తున్నాను." "అవేం మాటలు. మనం ఎప్పటికీ కలిసుంటాం. ఎన్ని విషయాలన్నా మాట్లాడుకుంటాం." ఎందుకనో ఎదో భయం కలిగింది సింహరాజు గుండెల్లో. "నువ్వున్నావన్న ధైర్యంతోనే వున్నాను. నీ గురించిన ఆలోచనలే నన్నా అవమానాలు భరించేలా చేశాయి. కేవలం నీ మీద ప్రేమవల్లే మా నాన్న నన్ను అంతగా వదిలేసినా నేను ఆనందంగా ఉండగలిగాను." "ఈ విషయాలన్నీ నాకు చాలా కొత్తగా వున్నాయి. నువ్విలా మాట్లాడతావని నేనెప్పుడూ అనుకోలేదు." మల్లిక అలా మాట్లాడుతూ వుండడం ఒకపక్క భయం ఇంకోపక్క ఆనందం కలిగిస్తూ వున్నాయి. "నువ్వు చెప్పినట్టుగానే నేను వెళ్ళిరాగానే మనిద్దరం పెళ్లిచేసుకుందాం. అప్పుడు చాలా చాలా విషయాలు మాట్లాడుకుందాం." ఆ తరువాత ఎలాగో మల్లిక ని విడిపించుకుని బయలుదేరాడే కానీ మనసంతా