వెంటాడే నీడలు - 17

వెంటాడే నీడలు ( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పారానార్మల్ థ్రిల్లర్) కొట్ర శివ రామ కృష్ణ "నేను రావాల్సిన చోటుకే వచ్చానని నాకు అర్ధం అయింది." సింహరాజు ఇంటిలోకి ప్రవేశించి అక్కడ వున్న చెడ్డ దేవతల బొమ్మలు చూసాక యస్మణి అన్నాడు. "ఎవరిదగ్గరనుండో ఎందుకు నేను నీ దగ్గరనుండి కావాల్సినంత సమాచారం తీసుకోగలను." "కానీ నేను బాణామతి, చేతబడి లాంటివి చెయ్యను." సింహరాజు అన్నాడు. "నిజానికి నేను పరిశోధన చేద్దామనుకుంటున్నది మానవాతీత శక్తులు ఉన్నాయా, ఉంటే వాటికీ మనసుకి ఎటువంటి సంబంధం వుంది అన్న విషయం మీద. నువ్వు నాకు అవసరమైన సమాచారం ఇవ్వగలిగితే నేను దానికి కూడా డబ్బు ఇస్తాను." సింహరాజు కి చాలా సంతోషం అనిపించింది. ఈ వ్యక్తిని చూస్తే చాలా ధనవంతుడిలాగే వున్నాడు. తనకీ ప్రస్తుతం డబ్బుతో అవసరం బాగానే వుంది. వాళ్ళ పొలాల్లో, వీళ్ళ పొలాల్లో పనిచేసి సంపాదిస్తున్నది సరిపోవడం లేదు.