ప్రణయ గీతిక - 5

  • 81

లతీకని ఇంటికి వదిలి వచ్చిన తర్వాత ప్రభ ఫామ్ హౌస్ కి వచ్చి నిద్రపోయి ఉదయం లేచి బయటికి వచ్చి చూస్తే పతంగి చాలా సంతోషంతో కనిపిస్తూ ఉన్నాడు.పతంగి అన్నయ్య లో  ఈరోజు ఇంత హుషారేంటి? ప్రశ్నిస్తాడు ప్రభ"ఈరోజు మా ఇంటి మహాలక్ష్మి వస్తోంది " అని చెప్పి  లోపలికి వెళ్ళాడు.ఆ మాట విన్న ప్రభకి ఓ !  పెద్దాయన  చిన్న పాపతో ఈ ఊరికి వచ్చారని పతంగి అన్నయ్య చెప్పారుగా తను ఆ అమ్మాయే అయి ఉంటుంది" అయ్యో!  తన పేరు అడగడం మర్చిపోయాను సరేలే వచ్చినాకైనా తెలుస్తుంది తను మేము ట్రైనింగ్ క్లాస్ కి వెళ్ళకముందే వస్తే బాగుండు తను ఎలా ఉందో ఒకసారి చూడాలనిపిస్తుంది" అనుకొని ట్రైనింగ్ క్లాస్ కి వెళ్లాలని రెడీ అవుతూ ఉండగా పెద్దాయన కారు డోరు  ఓపెన్ చేయడం చూసిన ప్రభా కిటికి నుంచి తొంగి చూస్తే తెల్లని రంగు నిండుదనమున్న డ్రస్సులో దిగిన