వెంటాడే నీడలు - 16

  • 288
  • 120

వెంటాడే నీడలు ( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పారానార్మల్ థ్రిల్లర్) కొట్ర శివ రామ కృష్ణ "హు, నాన్న. నా నాన్న ఆఖరిసారి నాతో ఎప్పుడు మాట్లాడాడో నీకు తెలుసునా? అసలు నేనొక్కర్తిని తన కూతురిగా వున్నానన్న విషయమే తనకి గుర్తు లేదు." కోపంగా అంది మల్లిక. "అసలు ఇక్కడికి వచ్చే సంవత్సరం పైన అయింది. ఇప్పుడు తనే సంపాదించుకుంటున్నాడు కదా, మా డబ్బుతో కూడా పనిలేదు." "ఎదో ఉద్యోగంలో ఖాళీ లేకుండా వుండివుంటాడు. నువ్వు అనవసరం గా అపార్ధం చేసుకుని కోపం పెంచుకోకు. నువ్వు తన స్వంత కూతురివి. మీ కుటుంబానికి కావాల్సిన డబ్బులు పంపిస్తున్నాడు, ఆ విషయం మర్చిపోకు. " "సర్లే, సర్లే, ఆ విషయాలు ఇప్పుడు అనవసరం. నువ్వు వీటన్నిటి గురించి చెప్తావా లేదా నాకు?" "నేను చెప్పను. ఇప్పుడంత ఓపిక నాకు లేదు. బాగా చీకటి పడింది, పద ఇంటి దగ్గర