ప్రభ, గోవిందు ' సారంగ్ లు ప్రిన్సిపల్ గది వైపు నడుస్తూ ఉండగా గోవిందు మొదట వెళతాడు. "మే ఐ కమ్ ఇన్ సార్" అడిగాడు గోవిందు ప్రిన్సిపాల్ సర్ ని చూసి. "ఎస్ కమ్ ఇన్" అని ప్రిన్సిపల్ అనేసరికి వినయంగా నిలబడతాడు గోవిందు లోపలికి వచ్చి. ఇంతకీ కింగ్ ఎక్కడ ? పుస్తకంలో ఏదో రాస్తూ అడుగుతారు ప్రిన్సిపాల్. అదిగో వచ్చేసాడు సార్ అని డోర్ వైపు చూపిస్తూ చెప్తాడు గోవిందు. వాడెప్పుడూ లేటే అయినా లేటెస్ట్ అనుకో అని ప్రిన్సిపల్ అంటూ ఉండగా "మే ఐ కమ్ ఇన్ సర్ "అడుగుతాడు ప్రభ. "ఎస్ కమ్ ఇన్ " అని పిలిచి ఇలా లేట్ చేస్తే నీ రాజ్యాన్ని ఆక్రమించే వాళ్ళు చాలామంది ఉంటారు "ఐ ఆల్వేస్ లివ్ లైక్ ఎ కింగ్ "అనిరాసుకుంటే సరిపోదు రాజుకి సమయపాలన అనేది కచ్చితంగా ఉండాలి అని ప్రిన్సిపల్ చెప్తూ ఉంటే ప్రభ ప్రిన్సిపల్స్ సర్వైపు చూస్తాడు" మై డియర్