వెంటాడే నీడలు ( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పారానార్మల్ థ్రిల్లర్) కొట్ర శివ రామ కృష్ణ "భయపడకు. నేనున్నాను కదా. నేను నీకేం కానివ్వను." తన గుండెల్లో భయం గొంతులో బయటపడకుండా, తన కుడిచేత్తో మల్లిక కుడిభుజం తడుతూ అన్నాడు సింహరాజు. ఆ తరువాత విపరీతమైన జ్వరం వచ్చింది సాముదమ్మ కి. వూళ్ళో వైద్యుడు వచ్చి సూదిమందు ఇచ్చినా కూడా తగ్గలేదు. మూడోరోజు రాత్రి పదోగంట అవుతూండగా సింహరాజు ని దగ్గరికి పిలిచింది మంచం మీద పడుకునే సాముదమ్మ. మంచం మీద ఆమె కుడిపక్కన కూచుని తన రెండుచేతులు తన చేతుల్లోకి తీసుకున్నాడు సింహరాజు. మల్లిక కూడా ఆ ఇద్దరిదగ్గరికి వచ్చింది. "ఇంక మల్లిక బాధ్యత నీదే. ఆ కబుసా బారినుండి ఎలా కాపాడుకుంటావో, కానీ నా మనవరాలిని కాపాడే భారం నీదే." తరువాత ఆ గొంతు ఆగిపోయింది. ఆ తరువాత ఐదు నిమిషాల వరకూ తెలియలేదు