వెంటాడే నీడలు ( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పారానార్మల్ థ్రిల్లర్) కొట్ర శివ రామ కృష్ణ "ఎక్జాట్లీ." నవ్వింది సమీర. "తను మర్డర్ అటెంప్ట్ చేసిన ఇద్దరూ కూడా తనని చాలా అభిమానించే వాళ్లే. వాళ్ళు చచ్చిపోవడానికి కూడా అంతబాధపడరేమో కానీ, కానీ తను జైలుకి వెళ్ళిపోతుంది కదా. తనేదో సైకలాజికల్ డిజార్డర్ వల్ల చంపేసిందంటే లా ఒప్పుకుంటుందా?" "ఈ ఇద్దరిమీద తప్ప ఇంకెవరిమీదా తను అలాంటి మర్డర్ అటెంప్ట్ చెయ్యలేదా?" "లేదు." తల అడ్డంగా ఊపింది సమీర. "అసలు తను వాళ్ళిద్దరిమీద మర్డర్ అటెంప్ట్ చేసివుండకపోతే, వాళ్ళునన్ను సంప్రదించి ఉండేవారు కాదు." "తను కాలేజ్ స్టూడెంట్ కదా." సమీర చెప్పింది గుర్తుచేసుకుంటూ అన్నాడు నిరంజన్. "కాలేజ్ లో ఎవరిదగ్గరన్నా అబ్నార్మల్ గా బిహేవ్ చేసిందా?" "లేదు. అటువంటి హిస్టరీ ఏమీ లేదు. ఎక్సెప్ట్ దీజ్ టూ మర్డర్ అటెంప్ట్స్, తక్కినవి మనం అంత సీరియస్ గా