వెంటాడే నీడలు ( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పారానార్మల్ థ్రిల్లర్) కొట్ర శివ రామ కృష్ణ "అంటే మా డాడ్, గ్రాండ్ పా ఏదడిగినా నువ్వు చేసేస్తావా?" "చేస్తానమ్మా, అది నా ధర్మం గా భావిస్తాను. అలాగే ఇప్పటివరకూ చాలా ముఖ్యమైన, ప్రధాన మైన పనులు చేసిపెట్టాను." అదే చిరునవ్వుతో అన్నాడు ఓబులేసు. ఎదో అడగబోతూన్నదల్లా సడన్ గా సారిక ఎక్స్ప్రెషన్ లో కనిపెట్టలేని మార్పు వచ్చింది. కుర్చీలోనుండి ఒక్క ఉదుటున లేచి, ఓబులేసు దగ్గరికి వచ్చి, అతని మెడ చుట్టూ తన రెండు చేతులూ వేసింది. "నేను నిన్ను బతకనివ్వను. చంపేస్తాను. చంపి తీరతాను." వాడి మెడ రెండుచేతులతో గట్టిగా పిసుకుతో అరవడం మొదలుపెట్టింది. "ఏమిటిది......... తల్లీ? వదిలి...........పెట్టు. లేకపోతె ...... ఊపిరాడక చచ్చిపోతాను." ఆ చేతుల్ని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ, ఊపిరాడక అవస్థపడుతూ అంటున్నాడు ఓబులేసు. "లేదురా. నిన్ను ప్రాణాలతో ఉండనివ్వను. ప్రాణాలతో ఉండనివ్వను." ఇంకా