వెంటాడే నీడలు ( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పారానార్మల్ థ్రిల్లర్) కొట్ర శివ రామ కృష్ణ "ఈ మధ్యకాలం లో ఏదైనా మెంటల్ కేర్ కి అటాచ్ అయి ఉండడం, సొంతంగా ప్రాక్టీస్ చెయ్యడం ఇష్టపడలేకపోతూఉన్నాను. ఏదో దేశం అంతా తిరిగి చూడాలనిపిస్తూ వుంది, అదే చేస్తున్నాను. అందులోనూ నాకు మీలా స్టూడెంట్స్ కూడా చాలా మంది వున్నారు కదా, వాళ్ళదగ్గరికి కూడా వెళ్తూవుంటాను. ఎవరన్నా నా సహాయం అడిగినా కూడా చేస్తూవుంటాను." "మీ సహాయం మాలాంటివాళ్ళందరికీ ఎప్పుడూ కావాలి. మీరలాంటి దృక్పధం తో కూడా ఉండడం చాలా ఆనందకరమైన విషయం." నిరంజన్ అన్నాడు. "నాకెందుకో మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని చూడాలనిపించింది. ఇంక త్వరలోనే మనం కొంతకాలం ఒకరికొకరం చాలా అవసరం పడతామని నాకు అనిపిస్తూంది." యస్మణి అన్నాడు. "నిజం చెప్పాలంటే మీ అవసరం మాకెప్పుడూ వుంది. కానీ మేము ఏ రకంగా మీకు అవసరం