వెంటాడే నీడలు - 4

వెంటాడే నీడలు ( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పారానార్మల్ థ్రిల్లర్) కొట్ర శివ రామ కృష్ణ "రిలాక్స్ .........రిలాక్స్ ........... కంగారు పడకు." ప్రమీల అంది. "ఇప్పటికీ నువ్వు ఆ ఒంటె తల వున్న మనిషిబొమ్మ గీస్తున్నావా?" "ఎస్, గీస్తున్నాను. ఒక్కోసారి చాలా కోరికగా అనిపిస్తుంది ఆ బొమ్మ గియ్యాలని. గీసి అలాగే చింపి పడేస్తాను. నా చిన్నప్పటిలా అందరికీ తెలిసేలా చెయ్యడం లేదు. అలాగే ఏవో వింత శబ్దాలు కూడా అప్పుడప్పుడు వినిపిస్తూ వుంటాయి. కాస్త రీసెర్చ్ చేసిన మీదట ఒంటెలు అలంటి శబ్దాలు చేస్తాయని తెలిసింది  నాకూ, ఒంటెలు కి వున్న సంభందం ఏమిటో ఎంత ఆలోచించినా బోధపడ్డం లేదు." ఆ ఆవేదనలో కూడా ఉండలేక నవ్వింది సారిక. ప్రమీల కూడా నవ్వింది. "ఇది కొంచెం ఆశ్చర్యపడాల్సిన విషయమే. ఒంటె బొమ్మ ఎందుకు గియ్యాలి? ఒంటె సకిలింత ఎందుకు వినాలి?" "నాలో వున్న మరో