వెన్నెల పూలు - 17

వెన్నెల పూలు ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ "ఎంతమాత్రం కూడా సందేహం లేకుండా, పూర్తిగా నమ్మకం కలిగింది." తనూ బెడ్ దిగి డ్రెస్ చేసుకుంటూ అన్నాడు అభినవ్. "అసలు అలా ఫ్యూలిష్ గా ఎలా ఆలోచించానో బోధపడ్డం లేదు." "నీ నుండి విడిపోవడానికి నిర్ణయించుకుని రూప నీకు ఆ అవకాశం ఇవ్వలేదు." డ్రెస్ చేసుకోవడం పూర్తిచేసుకుని బెడ్ ఎడ్జ్ మీద కూచుని అంది తనూజ. "లేకపోతె ఇంతే సక్సెస్ ఫుల్ గా తనకీ నువ్విది చేసివుండేవాడివి." "నువ్వు చెప్పింది నిజమే." తనూడ్రెస్ చేసుకోవడం పూర్తిచేసుకుని తనూజ కి బెడ్ మీద కుడిపక్కన కూచుంటూ అన్నాడు అభినవ్. "నేనంటే అంతగా ఇష్టపడని తను నా నుండి అలా విడిపోవడం మంచిదే. కానీ నాకు అర్ధం కానీ విషయం నేనంటే ఇష్టం లేనప్పుడు, ఆ విషయం తన పేరెంట్స్ కి ఎందుకు గట్టిగా