వెన్నెల పూలు - 15

వెన్నెల పూలు ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ "నీ మీద ఎంత ప్రేమ వున్నా ఆ ప్రేమ కోసం తప్పులు చేసే స్థాయికి నేను దిగజారను." తన చేతిని తీసేడానికి ట్రై చేస్తూ అన్నాడు చలపతి కోపంగా. "అయితే ఆ డబ్బు ఎలా వచ్చిందో చెప్పు?" అదే తీవ్రతతో అడిగింది. "మా అమ్మ బంగారం ఉంటే అమ్మేసాను." అతని స్వరం లో ఎదో బాధవుంది. "తనేలేదు. ఇంక ఆ బంగారం తో పనేంటి?" కరెంట్ షాక్ కొట్టినట్టుగా అతనిని విడిచిపెట్టి దూరంగా జరిగి అతని మొహంలోకి ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది. "ఒక ఉంపుడు గత్తె కోసం తల్లిబంగారం అమ్మేశావా?" "తల్లినే అమ్మేసే వాళ్ళున్నారు. బంగారం ఎంత విషయం?" అప్పుడే అక్కడికి వచ్చిన తన అమ్మమ్మ అంది. "ఒరేయ్ అబ్బాయ్. మళ్ళీ దీని దగ్గరికి రావాలంటే బాగా డబ్బు పట్టుకురా. ఉట్టుట్టినే