మేనార్‌లోని ఆ పాత గోడలు నిశ్శబ్దంగా ఉన్నాయి, కానీ ఆ నిశ్శబ్దంలో ఏదో తెలియని భారముంది. కొద్ది గంటల క్రితం జరిగిన విధ్వంసం తాలూకు ఆ గుర్తులు గదిలో ఇంకా అలానే ఉన్నాయి. గాలిలో పగిలిన మట్టి పాత్ర వాసన, ఆవిరైపోయిన నీటి తాలూకు తేమ ఇంకా మిగిలే ఉన్నాయి.వేద తన గదిలో కిటికీ పక్కన మౌనంగా కూర్చుని ఉంది. కిటికీ బయట అమావాస్యకు దగ్గరగా ఉన్న ఆకాశం చీకటిని పూసుకున్నట్టు ఉంది. ఆమె అరచేతుల మీద ఉన్న ఎర్రటి కాలిన గాయాలు ఇంకా సెగలు పుడుతూనే ఉన్నాయి. ఆమె చేతిపై ఉన్న ఆ మంట కంటే, తన శక్తినే తాను అదుపు చేసుకోలేకపోయానన్న బాధ ఆమెను ఎక్కువగా దహిస్తోంది. అంతలో అర్జున్ నెమ్మదిగా వేద ఉన్న గదిలోకి, అతని చేతిలో ప్రథమ చికిత్స కిట్ తో పాటు వచ్చాడు. అతను, వేద పక్కన చాప మీద కూర్చుని, మౌనంగా ఆమె చేతిని