వేద - 15

  • 222
  • 72

ఆ రాత్రి మేనార్ ప్రధాన ద్వారం అంత వేగంగా, అంత బలంగా మోగేసరికి అందరి గుండెలు ఒక్కసారిగా ఆగిపోయాయి. వేద భయంతో వణికిపోతూ అర్జున్ వెనుక దాక్కుంది. గురుస్వామి నెమ్మదిగా వెళ్లి ఆ భారీ ఇనుప తలుపులు తెరిచారు. కానీ వారు అనుకున్నట్టు అక్కడ ఉన్నది శత్రువు కాదు. అక్కడ ఉన్నది గజగజ వణికిపోతున్న ఒక కుర్రాడు.. గురుస్వామి పంపిన వార్తాహరుడు. ఏదో ముఖ్యమైన సమాచారాన్ని మోసుకొచ్చాడు.ఆ క్షణం గడిచిపోయింది కానీ, వేద మనసులో మొదలైన అలజడి మాత్రం తగ్గలేదు. "ప్రతి చిన్న శబ్దం నన్ను భయపెడుతోంది. బయట ఉన్న శత్రువు కంటే, నా లోపల పెరుగుతున్న ఈ మృగం ఎప్పుడు బయటకు వస్తుందో అన్న భయం నన్ను చంపేస్తోంది. నా వల్ల నా చుట్టూ ఉన్నవాళ్ళకి ప్రమాదం తప్పదేమో!" అని వేద తనలో తను మధనపడుతూనే ఉంది.మరుసటి రోజు ఉదయం..మేనార్‌లోని ఒక పాత ధ్యాన మందిరం యొక్క గది నిండా సాంబ్రాణి ధూపం అలముకుని