వేద - 14

ఆకాశంలో పిడుగుల హోరు మెల్లగా తగ్గినా, ఆ గదిలో నెలకొన్న నిశ్శబ్దం అంతకంటే భయంకరంగా ఉంది. మేనార్‌ కోట గోడలు ఇంకా వణుకుతున్నట్టే ఉన్నాయి. గురుస్వామి అన్న మాటలు వేద చెవుల్లో పదే పదే ప్రతిధ్వనిస్తున్నాయి. "నువ్వు ఈ ప్రపంచం అంతానికి కారణం అవుతావు!" అన్న హెచ్చరిక ఆమెను నిలువునా దహించివేస్తోంది.అప్పటివరకు ఆశ్చర్యంలో మునిగిపోయిన అర్జున్, ఒక్కసారిగా తేరుకున్నాడు. అతని ముఖంలో భయం కంటే ఎక్కువ అవిశ్వాసం కనిపిస్తోంది. తన చేతిలోని డైరీని గట్టిగా పట్టుకుని, గురుస్వామి వైపు ఒక అడుగు ముందుకు వేశాడు."అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు స్వామీ? ఆధునిక యుగంలో ఉండి కూడా మమ్మల్ని ఇలాంటి వింత కథలు నమ్మమంటారా?" అని నవ్వుతూ అన్నాడు అర్జున్. అతని నవ్వులో వెటకారం కంటే, తన లాజిక్‌కు దొరకని నిజాన్ని అంగీకరించలేకపోతున్న ఆవేదన కనిపిస్తోంది. "రక్తం అంటే హిమోగ్లోబిన్, ఐరన్, ప్లాస్మా.. అంతేకానీ అందులో ఏవో పురాణ కాలపు జ్వాలలు ఉండటం ఏంటి? ఇదంతా కేవలం వినడానికి