వేద - 11

వికాస్ చెప్పిన నమ్మలేని నిజానికి బైక్ హ్యాండిల్‌ను గట్టిగా పట్టుకున్న అర్జున్ చేతులు వణుకుతున్నాయి. చెవుల్లో వికాస్ చెప్పిన మాటలు ఇంకా ప్రతిధ్వనిస్తున్నాయి. "డాక్టర్ శివరామ్ మూడేళ్ల క్రితమే చనిపోయాడు అర్జున్!"అంటే.. వేద తనకు చూపించిన ఆ రిపోర్టులు, ఆ కన్నీళ్లు, ఆ అరుదైన జబ్బు కథ.. అంతా పక్కాగా అల్లిన ఒక అబద్ధం! కానీ ఎందుకు? తనలోని అసాధారణ శక్తిని దాచుకోవడానికా? లేక తనను అనుసరిస్తున్న వారి నుండి తనను తాను కాపాడుకోవడానికా? వేద చుట్టూ ఏదో అదృశ్య వలయం ఉంది. అది తనను మోసం చేస్తోందా లేక ప్రమాదంలో పడేస్తోందా అన్నది అర్జున్‌కు అర్థం కావడం లేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం.. వేద ప్రమాదంలో ఉంది. ఆ నిజాన్ని గ్రహించిన మరుక్షణమే అర్జున్ తన బైక్‌ను వేగంగా వెనక్కి తిప్పాడు. ఇంజిన్ గర్జన ఆ నిశ్శబ్ద రాత్రిని చీలుస్తూ వేద ఉన్న చోటుకి పరుగు తీసింది.అక్కడ.. వేద ఇంటికి వెళ్ళే దారిలో